Last Updated:
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశ రూపురేఖలను మార్చేసింది. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ దిగుమతుల నుంచి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించింది.
భారతదేశాన్ని కేవలం సేవల రంగానికి పరిమితం చేయకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. గత 12 ఏళ్ల కాలంలో విధానపరమైన సంస్కరణలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్, జీఎస్‌టీ, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలతో భారత్ ప్రపంచ తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారింది. 2014 ఏప్రిల్ నుంచి 2025 మార్చి మధ్య కాలంలో తయారీ రంగంలోకి ఏకంగా 184 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయి.














