Last Updated:
Rambha Urvasi Menaka Trailer: అల్లరి నరేష్ కాన్సెప్ట్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనకా’తో ముందుకు వచ్చారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే నవ్వు ఆగదు..
Rambha Urvasi Menaka Trailer: ‘అల్లరి’ సినిమా నుండి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన కామెడీ కింగ్ అల్లరి నరేష్.. గత కొంతకాలంగా ‘నాంది’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సీరియస్, ఇంటెన్స్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఆ సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. నరేష్ మార్క్ అవుట్ అండ్ అవుట్ హలేరియస్ కామెడీని ఫ్యాన్స్ బాగా మిస్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్స్‌కు వినోదాల విందు అందించడానికి అల్లరి నరేష్ తన పాత కామెడీ రూట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన సరికొత్త వినోదాత్మక చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.














