అయితే లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్, పరువునష్టం, సైబర్ హింస, చీటింగ్ వంటి సెక్షన్లను ఈకేసులో పొందుపర్చారు. అయితే బాధితురాలు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై ఇచ్చిన కంప్లైంట్ వెనుక మరో కోణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. బాధిత యువతి రాహుల్ రెడ్డితో ఉద్దేశపూర్వకంగానే కలిసిందని.. పెళ్లి పేరుతో అతడ్ని బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిందని.. ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది.













