Last Updated:
పిల్లలను తీసుకొని పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల అల్లరి మనకు తెలిసిందే. అయితే ఈ స్టార్టప్ మాత్రం కార్యక్రమాల్లో పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. పూర్తి వివరాాలు తెలుసుకోండి.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంధుమిత్రుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇలాంటి శుభకార్యాలకు వెళ్లడం అందరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రం ఇది ఒక పెద్ద సవాల్‌గా మారుతుంది. ఫంక్షన్లో బంధువులతో సంతోషంగా గడుపుదామంటే పిల్లల అల్లరి, వారి బాగోగులు చూసుకోవడంతోనే సమయం అంతా సరిపోతుంది. సరిగ్గా ఈ సమస్యనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మలుచుకుంది ఓ హైదరాబాద్ స్టార్టప్. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో చిన్నారుల బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటూ తల్లిదండ్రులకు ప్రశాంతతను పంచుతున్న ఆ వినూత్న స్టార్టప్ పేరే గిగిల్ అండ్ గార్డ్ (Giggle & Guard). గిగిల్ అండ్ గార్డ్‌కు చెందిన స్వాతి ఫోన్ కాల్ ద్వారా న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో పలు అంశాలు వెల్లడించారు.














