Donald Trump: రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? | ట్రెండింగ్ | ACTPnews

రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? (Image - x - @MattWallace888)


Last Updated:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవల్ ఆఫీసులో సడెన్‌గా ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆమె ఎవరు.. ఎందుకు అక్కడ ఉంది? ట్రంప్ ఆమెను ఎందుకు తెచ్చుకున్నారు? ఇలా అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? (Image - x - @MattWallace888)
రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? (Image – x – @MattWallace888)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఒక వింతైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను, అంతర్జాతీయ మీడియాను షేక్ చేస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ, ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసే ట్రంప్.. ఈసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారారు. ముఖ్యంగా గతంలో తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు జో బిడెన్‌ను తరచుగా “స్లీపీ జో” (Sleepy Joe) అని తీవ్రంగా ఎగతాళి చేసిన ట్రంప్, ఇప్పుడు అదే తరహా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన విధుల్లో భాగంగా జరిగే అధికారిక సమావేశాల మధ్యలో ఆయన పదే పదే నిద్రలోకి జారుకుంటున్నారనీ, ఆయనను అత్యవసరంగా తట్టిలేపడానికి ఒక ప్రత్యేకమైన మహిళా సిబ్బందిని ఆయన నియమించుకున్నారని ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ వైరల్ పుకార్ల ప్రకారం, ఆ మహిళ దగ్గర ఒక సీక్రెట్ ‘బజర్’ (Buzzer) ఉంటుందనీ, ట్రంప్ ఎప్పుడైతే స్పృహ కోల్పోయి కునుకు తీస్తున్నట్లు అనిపిస్తుందో అప్పుడు ఆమె.. ఆ బజర్‌ను నొక్కి ఆయనను వెంటనే మేల్కొల్పుతుందని సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *