Last Updated:
హెచ్ఐవీపై మీకు ఈ అపోహలు ఉన్నాయా? అయితే వెంటనే ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి!
ప్రాణాంతక వ్యాధులైన హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ మహమ్మారి పట్ల సమాజంలో నెలకొన్న అపోహలను పారద్రోలి, ప్రజలందరిలో పూర్తిస్థాయి అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఈ వ్యాధుల నియంత్రణ, నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఒక భారీ అవగాహన ర్యాలీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ బుధవారం హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద పచ్చజెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మహత్తర కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన పౌరులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు.













