Last Updated:
ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. లీగ్ దశలో భాగంగా జరుగుతున్న 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్ నమోదు చేయాలనే వ్యూహంతో SRH బరిలోకి దిగింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 20 పాయింట్లతో నేరుగా క్వాలిఫయర్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో సాధారణ విజయం సాధించినా స్థానంలో పెద్ద మార్పు ఉండదు. అయితే భారీ రన్‌రేట్ తేడాతో గెలిస్తే టాప్-2లోకి ఎగబాకే అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్ SRHకు కూడా అత్యంత కీలకంగా మారింది.
టాస్ అనంతరం మాట్లాడిన పాట్ కమిన్స్, జట్టు లక్ష్యం స్పష్టంగా టాప్-2లో నిలవడమేనని వెల్లడించాడు. “మాకు ఇది చాలా పెద్ద మ్యాచ్. టాప్-2లో స్థానం దక్కించుకోవాలంటే భారీ గేమ్ ఆడాలి. మా బ్యాటర్లంతా దూకుడుగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు,” అని కమిన్స్ తెలిపాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లతో కూడిన SRH ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టాలని చూస్తోంది. మధ్య ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్లపై భారీ బాధ్యతలు ఉండనున్నాయి.
ఇక ఆర్సీబీ తరఫున స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెప్టెన్ రజత్ పాటిదార్‌తో పాటు దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా జట్టుకు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ జోడీ SRH బ్యాటర్లను ఎంతవరకు నియంత్రిస్తుందో చూడాలి.
తుది జట్లు ఇవే..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్
విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana