Last Updated:
ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం..!
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో బుధవారం కనిపించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. సాధారణంగా ఆలయ ఉత్సవాల్లో గంభీరంగా అడుగులు వేస్తూ కనిపించే గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీకి చెందిన మూడు ఆడ ఏనుగులు లక్ష్మి, వైష్ణవి, పద్మావతిలను పూజించి, వాటికి ఆహారం అందించారు. దీంతో ఎస్వీ గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.














