Last Updated:
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, అన్నప్రసాదం, భద్రతపై దృష్టి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టంగా భావించే ఈ వ్రతాన్ని ఆగస్టు 21న వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.














