Last Updated:
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందిన ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu) పదో సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలతో వేడెక్కుతోంది. తాజాగా బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షపై ఉప్పల్ బాలు దుమ్మెత్తిపోశాడు.
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందిన ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu) పదో సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలతో వేడెక్కుతోంది. ఈసారి సీజన్ 10 కావడంతో నిర్వాహకులు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సామాన్యులను (Commoners) హౌస్‌లోకి పంపించేందుకు ‘అగ్నిపరీక్ష’ (Agni Pariksha) పేరుతో ప్రత్యేక ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ ద్వారా వందలాది మంది నుంచి 15 మందిని ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేసి, వారిలోంచి ఐదారుగురిని తుది కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి పంపనున్నారు. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.














