Last Updated:
తిరుమల జేఈఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి, సేవా స్ఫూర్తిపై సందేశం ఇచ్చారు.
తిరుమలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, జాతీయ స్ఫూర్తి నడుమ ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని జేఈఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు.













