Last Updated:
వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. అలాంటి ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాలయా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌ను గమనిస్తే సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ అవెలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని రివీల్ చేశారు. సినిమా కథనంలో ఓ వేగం కనిపిస్తూనే ఎంటర్టైనింగ్గానూ సినిమా ఉంటుందనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ..














