Last Updated:
ఇండొనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోరెస్ కి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఇండొనేసియాలోని ఈస్ట్ నుసా తెంగ్గరా ప్రావిన్స్‌లోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైంది. ఎపిసెంటర్ ఎండే నగరానికి ఉత్తర-వాయవ్య దిశగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్రంలో ఉంది. లోతు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇది ప్రమాదకర భూకంపంగా చెబుతున్నారు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 5:58 గంటలకు (సెంట్రల్ ఇండొనేసియన్ టైమ్) ఈ కంపనం వచ్చింది.














