Last Updated:
మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ఓ డిఫరెంట్ థ్రిల్లర్‌తో స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ఓ డిఫరెంట్ థ్రిల్లర్‌తో స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్, ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














