Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రోనాల్డో గుడ్‌బై? రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రోనాల్డో త్వరలో ఆటకు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, కుటుంబంతో కలిసి సమయం గడుపుతానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

News18
News18

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో తన రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2028 నాటికి తాను ఫుట్‌బాల్ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉందని తెలిపాడు. అల్ నాస్ర్ క్లబ్‌తో ఉన్న కాంట్రాక్ట్ వచ్చే ఏడాది వేసవితో ముగియనుండగా, ఆ తర్వాత ఆటకు బహుశా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఇటీవలే తన దీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకున్న ఈ 41 ఏళ్ల స్టార్ ఆటగాడు.. తాజా వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. “బహుశా ఇదే నా చివరి ఫుట్‌బాల్ సంవత్సరం కావొచ్చు. మైదానం నుంచి ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్లాలని కోరుకుంటున్నాను” అని అన్నాడు. ఇటీవల ముగిసిన 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ తరఫున ఆడిన రోనాల్డో రెండు గోల్స్ సాధించాడు. ప్రపంచ వేదికపై ఇది అతనికి చివరి టోర్నీ కావడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports