David Warner: స్టీవ్ స్మిత్‌కు క్లాస్ పీకిన డేవిడ్ భాయ్.. ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిదంటూ చురకలు! | క్రీడా వార్తలు | ACTPnews

స్టీవ్ స్మిత్, వార్నర్


Last Updated:

David Warner: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో ప్యాట్ కమిన్స్ సేన ఘోరంగా ఓడింది. ఇక ఈ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సొంత ప్లేయర్లను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

స్టీవ్ స్మిత్, వార్నర్
స్టీవ్ స్మిత్, వార్నర్

ఇక బ్యాడ్ బాయ్ డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికరమైన, వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై ఆ దేశ మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకముందే స్టీవ్ స్మిత్ డీఆర్‌ఎస్ (DRS) రివ్యూ కోరడం క్రీడా నిబంధనలు, గౌరవానికి విరుద్ధమని వార్నర్ విమర్శించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports