Last Updated:
BWF Championship: ఢిల్లీ వేదికగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి స్టార్ షట్లర్లు టైటిల్ కోసం బరిలోకి దిగారు.
అయితే సాధారణంగా అంతర్జాతీయ టోర్నీలంటే భారీ ప్రైజ్‌మనీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచే ఆటగాళ్లకు మాత్రం నిర్వాహకుల నుంచి నయాపైసా నగదు బహుమతి లభించదు. నగదు బహుమతి లేకపోయినా హేమాహేమీలైన క్రీడాకారులు ఈ టోర్నీ కోసం ఎందుకు పోటీ పడతారు? దీనివల్ల ఆటగాళ్లకు కలిగే ప్రయోజనాలేంటి?














