శ్రీవారి సన్నిధిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. సుప్రభాత సేవలో తిలక్ వర్మ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

వేకువజామునే శ్రీవారి సేవలో తిలక్ వర్మ.. తిరుమల వెంకన్నను దర్శించుకున్న స్టార్ క్రికెటర్.

+

News18

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో ప్రముఖ భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ తరించారు. మంగళవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున అత్యంత పవిత్రంగా జరిగే సుప్రభాత సేవలో ఆయన పాల్గొని నిశ్చల భక్తిశ్రద్ధలతో శ్రీవారిని వేడుకున్నారు. క్రీడా మైదానంలో తనదైన ఆటతీరుతో కోట్లాది మంది క్రీడాభిమానులను అలరించే ఈ స్టార్ క్రికెటర్, ఇలా ఆధ్యాత్మిక చింతనతో స్వామివారి సన్నిధికి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయనతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports