Last Updated:
PM Modi: జెన్ జీ వచ్చాక.. ఏదైనా వైరల్ అవ్వడం తేలికవుతోంది. ఎందుకంటే.. వారు కోట్లలో ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాతో కనెక్ట్ అయివుంటారు. వారు వీడియో క్లిప్స్ బాగా చూస్తారు. అందువల్ల ప్రధాని మోదీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
జాతీయ గీతం జనగణమన ఆలపించేటప్పుడు.. కదలకుండా, నిబద్ధతతో ఉండాలి అనేది రూల్. తద్వారా దానికి అత్యంత విలువ ఇచ్చినట్లు అవుతుంది. అలాగే దేశభక్తిని చాటుకున్నట్లు కూడా అవుతుంది. ఐతే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవల ఓ సభలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు.. నడుస్తూ ఉన్నారనీ.. ఆయనకు ఆ గీతం పట్ల రెస్పెక్ట్ లేదనీ.. అందుకే అలా చేశారని ప్రచారం చేస్తూ ఓ వీడియో వైరల్ అయ్యింది. అది కలకలం రేపింది.














