IPL 2026: గుజరాత్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ భారీ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు భారీ షాక్.. రూ. 12 లక్షల జరిమానా! | క్రీడా వార్తలు | ACTPnews

సన్ రైజర్స్ హైదరాబాద్


Last Updated:

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో హైదరాబాద్ జట్టు విఫలమవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2026: ఐపీఎల్ 2026 (IPL2026) సీజన్‌లో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ బాన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో హైదరాబాద్ జట్టు విఫలమవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

మొదటి తప్పు.. భారీ పెనాల్టీ

ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మొదటిసారి ఈ తప్పు చేస్తే జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తారు. మ్యాచ్ సాగుతున్న సమయంలోనే ఫీల్డింగ్ విషయంలో కూడా జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆఖరి ఓవర్లలో సర్కిల్ వెలుపల కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచేందుకు అంపైర్లు అనుమతించారు. దీనిని సొమ్ము చేసుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మపై కూడా చర్యలు

ఈ సీజన్‌లో శిక్షకు గురైన మొదటి ఎస్‌ఆర్‌హెచ్ (SRH) ఆటగాడు కమిన్స్ మాత్రమే కాదు. అంతకుముందు ఏప్రిల్ నెలలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నాడు. అవుట్ అయిన సందర్భంలో అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసినందుకు గాను, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంతేకాకుండా, అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.

నియమాలు కఠినం

ఐపీఎల్ మ్యాచ్‌లు టీవీ ప్రసారాల సమయానికి అనుగుణంగా ముగియాలని, స్లో ఓవర్ రేట్ వల్ల మ్యాచ్‌లు అనవసరంగా ఆలస్యం కాకూడదని బీసీసీఐ (BCCI) కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా ఇదే తప్పు పునరావృతమైతే కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు, తుది జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజులో జరిమానా పడే అవకాశం ఉంది. మూడోసారి తప్పు జరిగితే కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధిస్తారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు, రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి సాంకేతిక పరమైన పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ కమిన్స్ తన బౌలర్లను వేగంగా ఓవర్లు పూర్తి చేసేలా సమన్వయం చేసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *