Purushaha: సమ్మర్‌ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘పురుష:’.. మే 22న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతూ సమ్మర్‌ స్పెషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా రాబోతున్న సినిమా ‘పురుష:’. తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది చిత్ర యూనిట్.

News18
News18

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన వీరు అన్నకి థాంక్స్. నాకు యాక్టింగ్‌లో సపోర్ట్ చేసిన సప్తగిరి అన్నకి, కసిరెడ్డి అన్నకి థాంక్స్. సక్సెస్ ఫుల్‌గా ఈ మూవీని పూర్తి చేశాం. మా అందరినీ బాగా చూపించిన సతీష్ గారికి థాంక్స్. మా చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సమ్మర్‌లో ‘పురుష:’ మే 22న రాబోతోంది. నిర్మాతగా మా నాన్న గారు అనుకున్న స్థాయిలోనే సినిమాని తీశామని, నేను నటించానని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ విషయంలో నాకు సపోర్ట్ చేసిన నిర్మాత కోటేశ్వరరావు గారికి థాంక్స్. ఈ జర్నీలో అండగా నిలిచిన మా కెమెరామెన్ సతీష్ గారికి థాంక్స్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్‌కి ఆడియెన్స్ ఫిదా అవుతారు. ఈ సినిమాలో నటించిన సప్తగిరి గారు, కసిరెడ్డి గారు, మా హీరోయిన్లకు థాంక్స్. నేను ‘మళ్లీరావా’, ‘జెర్సీ’, ‘మసూద’ చిత్రాలకు పని చేశాను. నేను ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీయగలిగాను. సమ్మర్ స్పెషల్‌గా మా సినిమాని మే 22న రిలీజ్ చేయబోతోన్నాం. అందరూ చూసి మా మూవీని సపోర్ట్ చేయాలని, ఈ ప్రయాణంలో మీడియా మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమా మొత్తం మా డైరెక్టర్ వీరూ గారి పైనే ఆధారపడి ఉంది. మా నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సినిమా ఎలా ఉంది.. స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేది తెలియాలంటే మే 22 వరకు వేయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు. మా ముగ్గురు హీరోయిన్‌లు, కసిరెడ్డి తమ్ముడు అందరూ బాగా నటించారు. మా దర్శకుడు వీరూ పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక పది సంవత్సరాలు వినపడేలా ఉండాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నామ’ని అన్నారు.

కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ చిత్రం మే 22న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పురుషులు అందరు తల ఎత్తుకునేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సప్తగిరి అన్నతో ఫస్ట్ టైమ్ నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా హీరోయిన్లు ముగ్గురు కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతారు. ఇక్కడకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్యూ సో మచ్’ అని అన్నారు.

హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘నా ఫస్ట్ సినిమా ‘పురుషోత్తముడు’. ఇది నా రెండో సినిమా. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ స్టోరీ విన్నప్పుడు ఈ సినిమాలో నువ్వు హీరోయిన్‌గా చేస్తున్నావ్ అని వాళ్లు చెప్పారు. ఈ సినిమా టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రం మే 22న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

రాయంచ మాట్లాడుతూ .. ‘నాకు ఈ ‘పురుష:’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వీరూ గారికి స్పెషల్ థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. అందరి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా మే 22 న రిలీజ్ కాబోతుంది. అందరూ చూసి హిట్ చేయండి’ అని అన్నారు.

విషిక మాట్లాడుతూ .. ‘మా ‘పురుష:’ సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. మా డైరెక్టర్ వీరూ సార్ చాలా ఫన్నీగా ఉంటారు. నేను హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మే 22న థియేటర్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి’ అని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed