Last Updated:
అర్జున అవార్డులు వచ్చేశాయ్.. కానీ ఈసారి తుది జాబితా అందరినీ ఆశ్చర్యపరిచింది! ఎంపిక కమిటీ సిఫారసు చేసిన 24 పేర్లలో చివరకు 17 మంది క్రీడాకారులకే కేంద్రం ఆమోదం తెలిపింది. అసలు ఈ 17 మందిలో ఎవరెవరు ఉన్నారు? స్టార్ క్రీడాకారులు, యువ ప్రతిభావంతులు, పారా స్పోర్ట్స్ నుంచి ఎవరికెవరికీ గౌరవం దక్కింది?
Arjuna Award Winners : 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయాలు ప్రకటించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నను ఈ ఏడాది ఏ క్రీడాకారుడికీ ఇవ్వకూడదని నిర్ణయించింది. అదే సమయంలో అర్జున అవార్డుల జాబితాను భారీగా కుదించింది. ఎంపిక కమిటీ గతంలో సిఫారసు చేసిన 24 మందిలో 17 మందినే తుది జాబితాలో చేర్చింది.














