Last Updated:
Digital Arrest: అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి నిలువునా దోచుకునే సరికొత్త సైబర్ మోసం ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పోలీసు, దర్యాప్తు సంస్థల అధికారులమంటూ నకిలీ ఐడీలు, యూనిఫామ్లతో వీడియోకాల్స్ చేస్తూ నేరస్థులు రూ.కోట్లలో కాజేస్తున్నారు. తాజాగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ విశ్రాంత ఉద్యోగిని ఏకంగా ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో బెదిరించి, రూ.51 లక్షలు కొల్లగొట్టిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వెలుగుచూసింది.














