తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రముఖుల రాక. భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణ.. క్యూకాంప్లెక్స్‌లన్నీ ఫుల్.. తిరుమల వెళ్లే వాళ్లు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

+

News18

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. పవిత్రమైన తిరుమల గిరులు నిత్యం గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని మార్మోగుతూ ఉంటాయి. దేశ నలుమూలల నుంచి వచ్చే సామాన్య భక్తులతో పాటే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఏడుకొండల వాడిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ, కోలీవుడ్ నటుడు సూరి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సమేతంగా వేర్వేరుగా ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని తమ ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports