Last Updated:
అర్ధరాత్రి గ్రామ వీధుల్లో ఒక్కసారిగా మూడు సింహాలు ప్రత్యక్షం కావడంతో జనాలు భయ పడిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో మరోసారి సింహాల సంచారం కలకలం రేపింది. జేసర్ తాలూకాలోని చిరోడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మూడు సింహాలు సంచరిస్తూ కనిపించాయి. వేట కోసం గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఈ సింహాల కదలికలు స్థానిక రిహైడెన్షియల్ భవనానికి అమర్చిన CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.














