Arjun Tendulkar: అర్జున్ భవిష్యత్తుపై వీడిన సస్పెన్స్.. కెరీర్‌పై క్లారిటీ ఇచ్చిన సచిన్ తనయుడు | క్రీడా వార్తలు | ACTPnews

అర్జున్ టెండూల్కర్


Last Updated:

Arjun Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ డొమెస్టిక్ క్రికెట్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

అర్జున్ టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్

రాబోయే దేశవాళీ సీజన్‌లోనూ అతడు గోవా జట్టు తరఫునే కొనసాగనున్నట్లు ‘స్పోర్ట్‌స్టార్’ తాజా కథనంలో వెల్లడించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల అర్జున్, ఇటీవల గోవా జట్టు చేపట్టిన ఒమన్ పర్యటనకు దూరమయ్యాడు. దీంతో అతడు గోవా జట్టును వీడి మరో రాష్ట్రానికి మారనున్నాడనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే, అర్జున్ గోవా జట్టులోనే ఉంటాడని ఆ అసోసియేషన్ వర్గాలు స్పష్టం చేయడంతో ఈ వార్తలకు ముగింపు పడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports