Last Updated:
Pratibha Thakkadapalli: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మాటలు మంత్రుల వక్రబుద్ధిని బయటపెడుతోంది. తెలంగాణకు చెందిన ఈ ఛాంపియన్ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మెడల్స్ సాధించేందుకు కృషి చేసిన ఆడపిల్లను స్పోర్ట్స్ మినిస్టర్ కంగ్రాట్స్ చెప్పకుండా క్యూట్ గా ఉన్నావ్.. మీట్ అవుతవా అంటూ తన నీచబుద్దిని బయటపెట్టాడంటూ బాంబ్ పేల్చింది.
Pratibha Thakkadapalli: స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో బంగారు పతకాలు సాధించి దేశ కీర్తిని పెంచే వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వాళ్లకున్న నైపుణ్యాన్ని అభినందించాలి. వాళ్లను స్పూర్తిగా తీసుకునేలా ప్రభుత్వాలు వాళ్ల గొప్పదనాన్ని పది మందిలో చాటిచెప్పాలి. దేశంలో ఏ రాష్ట్రం తమ దగ్గరున్న ఛాంపియన్స్, గోల్డ్ మెడల్ విజేతలను ఏ విధంగా సత్కరిస్తుందో ..? వాళ్లను ప్రపంచ విజేతలుగా మారుస్తుందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత మాటలు మంత్రుల వక్రబుద్ధిని బయటపెడుతోంది. తెలంగాణకు చెందిన ఈ ఛాంపియన్ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మెడల్స్ సాధించేందుకు కృషి చేసిన ఆడపిల్లను స్పోర్ట్స్ మినిస్టర్ కంగ్రాట్స్ చెప్పకుండా క్యూట్ గా ఉన్నావ్.. మీట్ అవుతవా అంటూ తన నీచబుద్దిని బయటపెట్టాడంటూ బాంబ్ పేల్చింది. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి ప్రతిభా తక్కడపల్లి చేసిన కామెంట్స్ గత బీఆర్ఎస్ పాలనలో క్రీడాకారులకు జరిగిన అవమానానికి అద్దం పట్టేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. అసలు ఈ ఛాంపియన్ చెప్పిన మాటలు ఏంటో ఓసారి చూద్దాం.














