Last Updated:
ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభమైంది. ఆచంట మహేష్ (రంగస్థలం ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.














