Amit Shah: ‘వందేమాతరం’పై రగడ.. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ | | ACTPnews

అమిత్ షా


Last Updated:

స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన ఒక ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి స్పష్టతనిచ్చింది.

అమిత్ షా
అమిత్ షా

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన సైగలు పెను రాజకీయ వివాదానికి దారితీశాయి. రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. జాతీయ గేయం పాడుతుండగా మధ్యలోనే ఆపేయాలంటూ సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైగ చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 140 కోట్ల మంది ప్రజలు ఈ ఘటనను చూశారని, దేశం ఈ తప్పును ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *