పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిపై కేంద్ర మంత్రి అమిత్ షా కోల్కతాలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “బెంగాల్ ప్రజలు భయం నుంచి భరోసా వైపు ప్రయాణిస్తున్నారు.. దీదీ ఓటమి ఖాయం, బీజేపీ రాక సిద్ధం” అని ఆయన నినదించారు. బయటి వ్యక్తులు సీఎం అవుతారంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి పక్కా బెంగాలీ బిడ్డ, విద్యావంతుడు మరియు బీజేపీ కార్యకర్త మాత్రమే అవుతారని, ఆమె మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) కాదని స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత బెంగాల్లో ఒక్క మరణం కూడా లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడం బీజేపీ విజయానికి సంకేతమని అమిత్ షా పేర్కొన్నారు.
Source link
Amit Shah Bengal Prediction: దీదీ ఓటమి ఖాయం.. మాకు బంపర్ మెజార్టీ పక్కా | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










