భారత్ ఫ్యూచర్ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ప్రారంభించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












