Last Updated:
Aunt Nephew Live in Relationship: బెంగాల్లో అత్తా-అల్లుళ్ల మధ్య సాగుతున్న సహజీవన బంధం అత్యంత దారుణమైన , రక్తపాతంతో కూడిన ముగింపును చూసింది. అద్దె ఇంట్లో యువకుడి మృతదేహం లభించగా, మహిళ మృతదేహం ఛిద్రమైన స్థితిలో రైలు పట్టాలపై కనిపించింది. హత్య , ఆత్మహత్యతో ముగిసిన ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు ఏమంటున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
Aunt Nephew Live in Relationship: వివాహేతర సంబంధాలు కూడా నేరాలకు పురిగొల్పుతున్నాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈజంట మృతి కేసు మిస్టరీగా మారింది. బసిర్హత్ ఉత్తర 24 పరగణాస్, జుల్ఫికర్ మొల్లా ప్రాంతంలో ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉన్న తన మేనల్లుడిని చంపిన తర్వాత ఒక మహిళ రైలు పట్టాలపైకి పడి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన బసిర్హత్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈసూసైడ్ జరిగిన ముందు రోజు రైలు పట్టాల దగ్గర ఒక వివాహిత మహిళ మృతదేహం లభ్యమైంది. అదే సమయంలో బసిర్హట్లోని మోయిలాఖోలా సమీపంలో ఉన్న ఒక అద్దె ఇంట్లో ఆమె మేనల్లుడి మృతదేహం కూడా కనిపించింది. ఈ జంట మరణాలకు సంబంధించిన మిస్టరీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరణించిన వారిని దేబాశిష్ మోండల్ (32) రును మోండల్ (33)గా గుర్తించారు. వీరిద్దరూ బసిర్హట్లోని తత్రా ప్రాంతానికి చెందినవారుగా తేల్చారు పోలీసులు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం రునుకు సుమారు 14 ఏళ్ల క్రితం బంగావన్లో వివాహం జరిగింది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు పాత పరిచయస్తుడైన దేబాశిష్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రేమాయణంగా మారిందని, గత కొన్ని నెలలుగా వారు బసిర్హట్లోని ఒక అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్నారని సమాచారం.
ఒక బంధానికి సంబంధించి దేబాశిష్ మానసిక ఆందోళనలో ఉన్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంటికి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేస్తూ అతను ఇటీవల తన తండ్రికి ఫోన్ చేశాడని వారు పేర్కొంటున్నారు. అలాగే స్వయంగా రును కూడా ఫోన్ చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను దేబాశిష్ను చంపేశానని, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని ఆమెనే స్వయంగా దేబాశిష్ తండ్రికి తెలిపింది. బసిర్హట్ స్టేషన్ సమీపంలోని అనంతపూర్ ప్రాంతంలో రైలు పట్టాలపై రును మృతదేహం లభ్యమైంది. అదే సమయంలో ఆ ఇద్దరూ నివసిస్తున్న మోయిలాఖోలా సమీపంలోని అద్దె ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లగా, అక్కడ దేబాశిష్ మృతదేహం కనిపించింది. ఈ రెండు ఘటనలు ఆ ప్రాంతంలో కలకలం సృష్టించాయి.
రును కుటుంబం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. అయితే రును మొదట దేబాశిష్ను చంపి, ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని దేబాశిష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందనేది విచారణలో తేలాల్సి ఉంది. మరణాలకు గల అసలు కారణం, సమయం, పరిస్థితులను నిర్ధారించడానికి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. రెండు మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్షల కోసం తరలించారు.
(DISCLAIMER:This news piece may be triggering. If you or someone you know needs help, call any of these helplines: Aasra (Mumbai) 022-27546669, Sneha (Chennai) 044-24640050, Sumaitri (Delhi) 011-23389090, Cooj (Goa) 0832- 2252525, Jeevan (Jamshedpur) 065-76453841, Pratheeksha (Kochi) 048-42448830, Maithri (Kochi) 0484-2540530, Roshni (Hyderabad) 040-66202000, Lifeline 033-64643267 (Kolkata))
Hyderabad,Telangana













