Last Updated:
AUS vs ENG Final: మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026)లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
AUS vs ENG Final: మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026)లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించి ఏడోసారి పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. బెత్ మూనీ (49 బంతుల్లో 64; 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. లిచ్ ఫీల్డ్ (48) రాణించింది. ఫలితంగా ఆస్ట్రేలియా విజయం సులభం అయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు. అంతుకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (53 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అర్ధ సెంచరీ చేసినా చాలా నెమ్మదిగా ఆడింది. చివర్లో ప్రియా కెంప్ (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 150 పరుగుల మార్కును అందుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్థ్, లూసీ హామిల్టన్, సోఫీ, సదర్లాండ్లకు తలా ఒక వికెట్ లభించింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 151 పరుగులు చేస్తే.. 7వసారి టి20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలుస్తుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 05, 2026 11:19 PM IST













