Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి తొలి శాశ్వత సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం! | | ACTPnews

News18


Last Updated:

భారత వైమానిక దళ మాజీ అధికారి ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా అయోధ్య రామాలయ తొలి శాశ్వత సీఈవోగా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, భక్తుల సేవల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

News18
News18

భారత వైమానిక దళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు అత్యంత ప్రతిష్ఠాత్మక అయోధ్య రామాలయ బాధ్యతలు దక్కాయి. ఆయనను అయోధ్య రామాలయ తొలి శాశ్వత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమిస్తూ ఆలయ ట్రస్ట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వైమానిక దళంలో పశ్చిమ ఎయిర్ కమాండ్‌కు అధిపతిగా విశిష్ట సేవలందించిన ఆయన, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశ రక్షణ రంగంలో కొనసాగారు. ఆపరేషన్ సిందూర్‌లో పశ్చిమ విభాగాన్ని ముందుండి నడిపించి కీలక పాత్ర పోషించిన మిశ్రా.. 2026 ఏప్రిల్ 30న వైమానిక దళం నుంచి పదవీ విరమణ పొందారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *