Badrinath Temple: బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం | | ACTPnews

బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం (Image - PTI)


Last Updated:

Badrinath Temple: ఓవైపు అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కలకలం రేపుతూ ఉంటే.. మరోవైపు బద్రీనాథ్ ఆలయంలో కూడా అదే జరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. దాంతో ఆలయ నిర్వాహకులు విచారణకు ఆదేశించడం హాట్ టాపిక్ అయ్యింది.

బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం (Image - PTI)
బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం (Image – PTI)

బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ జరుగుతోందని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో.. వాటిపై బద్రీనాథ్, కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) విచారణకు ఆదేశించింది. ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ.. కానుకల లెక్కింపు, భద్రత, సిబ్బంది విధులపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. తర్వాత ఒక రిపోర్టును BKTCకి ఇస్తుంది.

సోషల్ మీడియాలో ఆరోపణలకు అసలు ఆధారాలు లేవు. అవన్నీ జస్ట్ ప్రచారాలు మాత్రమే. అయినప్పటికీ.. BKTC వాటిని సీరియస్‌గా తీసుకోవడం గొప్ప విషయమే. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ అంశం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నందువల్ల.. BKTC కూడా ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇకపై బద్రీనాథ్, కేదార్‌నాథ్ సహా అన్ని అనుబంధ ఆలయాల్లో విరాళాలు, ఆభరణాలు, ఇతర కానుకలకు సంబంధించి కచ్చితమైన డిజిటల్, మాన్యువల్ రికార్డులను నిర్వహించాలని కఠిన ఆదేశాలను జారీ చేసింది BKTC.

* సీసీటీవీ నిఘా, డిజిటలైజేషన్: విరాళాల లెక్కింపు కేంద్రాల దగ్గర సీసీటీవీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేశారు. అలాగే, భక్తులు ఇచ్చే ప్రతి విరాళానికి వెంటనే రసీదు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.

* భక్తులకు సూచనలు: సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిరాధారమైన వదంతులను భక్తులు నమ్మవద్దని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. అలాగే, విరాళాలను కేవలం అధికారిక కౌంటర్లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించి, విధిగా రసీదు పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికీ, బోర్డుకూ సమర్పించిన తర్వాత, ఒకవేళ ఎవరైనా సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు లేదా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చేయడమే ఈ విచారణ ప్రధాన ఉద్దేశం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *