Maa Inti Bangaram: ఇదిగో సమంత మా ఇంటి బంగారం డిలీటేడ్ సీన్స్.. వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సమంత లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం థియేటర్స్ లో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్, డిలీటెడ్ సీన్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తూ ‘మా ఇంటి బంగారం’ కూడా సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది.

ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సమంత బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. కేవలం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక పక్క సెంటిమెంట్ పండిస్తూనే, యాక్షన్ సన్నివేశాల్లో సామ్ చూపించిన తెగువకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. మూవీకి సంబంధించిన ‘డిలీటెడ్ సీన్స్’ (Deleted Scenes) తో పాటు సెట్‌లో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. థియేటర్లలో ఇప్పటికే నవ్వులు పూయించిన సినిమాలోని కామెడీ సీన్స్.. ఈ డిలీటెడ్ వీడియోలో మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

షూటింగ్ సెట్‌లో సమంత, సహ నటీనటులు చేసిన అల్లరి, డైలాగ్స్ మర్చిపోయినప్పుడు ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులకు తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ బిహైండ్ ద సీన్స్ వీడియోలో సామ్ చాలా ఉల్లాసంగా, సరదాగా కనిపించి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. యాక్షన్‌తో పాటు వినోదాన్ని పంచిన ఈ వీడియోను చూసి నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. సమంత అద్భుతమైన యాక్టింగ్, నందిని రెడ్డి టేకింగ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ ఫన్నీ డిలీటెడ్ సీన్స్ వీడియోను మీరూ చూసేయండి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports