Bigg Boss 10: మీ టాలెంట్ చూపిస్తారా నాయనా? ఇదిగో బిగ్ బాస్ వెల్‌‌కమ్ అంటోంది.. గోల్డెన్ ఛాన్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎంతో టాలెంట్ ఉన్న మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లి మీ లైఫ్‌ను మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. మీకు బిగ్ బాస్ వెల్‌‌కమ్ చెబుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

టీవీ షోల్లో అత్యంత భారీ నెట్‌వర్క్, క్రేజ్ కలిగిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) తన మైల్‌స్టోన్ 10వ సీజన్‌తో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. ఇప్పటికే 9 విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రేజీ షో.. ఇప్పుడు ‘దశావతారం’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఏడాది సరికొత్త ట్విస్టులు, రూల్స్‌తో ఆకట్టుకునే ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రోమోను రీసెంట్‌గా విడుదల చేశారు. ‘ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్’ అంటూ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున తన స్టైలిష్ లుక్‌తో షోపై అంచనాలను భారీగా పెంచేశారు.

సాధారణంగా సెలబ్రిటీలతో నడిచే బిగ్ బాస్ హౌస్‌లోకి సామాన్యులను (Common Man) పంపే ట్రెండ్ గతంలోనూ ఉంది. అయితే, గడిచిన 9వ సీజన్‌లో నిర్వాహకులు ప్రవేశపెట్టిన ‘అగ్నిపరీక్ష’ (Agnipariksha) కాన్సెప్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. సామాన్యులను ఎంపిక చేసి మెయిన్ హౌస్‌లోకి పంపించారు. దీని ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన విన్నర్ కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ (టాప్ 5 కంటెస్టెంట్), శ్రీజ, ప్రియా శెట్టి వంటి కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ అద్భుతమైన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం స్టార్ట్ కాబోతున్న 10వ సీజన్ కోసం కూడా ‘అగ్నిపరీక్ష సీజన్-2’ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

మరి ఎంతో టాలెంట్ ఉన్న మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లి మీ లైఫ్‌ను మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. సామాన్య అభ్యర్థుల కోసం డిజిటల్ ఆడిషన్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఆడిషన్స్ గడువు: జూన్ 12 నుండి జూన్ 20 అర్ధరాత్రి వరకు మాత్రమే.

ఎక్కడ అప్లై చేయాలి?: ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక ప్లాట్‌ఫామ్ అయిన http://bbtelugu.jiostar.com వెబ్‌సైట్ లేదా డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆడిషన్ వీడియో రూల్స్: దరఖాస్తుదారులు తమ వ్యక్తిత్వం, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా గరిష్టంగా 2 నిమిషాల నిడివి గల ఒక ఆడిషన్ వీడియోను షూట్ చేయాలి. అందులో తమ గురించి వివరిస్తూ.. అసలు తాము ఎందుకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో స్ట్రాంగ్ రీజన్ చెప్పి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి సెలక్షన్ ప్రాసెస్ మరింత కఠినంగా ఉండబోతోందని సమాచారం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక జ్యూరీ ప్రాథమికంగా వీడియోలను పరిశీలిస్తుంది. కేవలం మానసిక ధైర్యం, సోషల్ చార్మ్, 24 గంటల పాటు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయగల సత్తా ఉన్నవారిని మాత్రమే ఈ అగ్నిపరీక్ష ద్వారా ఫైనల్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.

ఈ మైల్‌స్టోన్ 10వ సీజన్ కోసం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలతో పాటు పలువురు సోషల్ మీడియా స్టార్స్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరి ఈసారి ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో రాబోతున్న ‘బిగ్ బాస్ 10’లో సామాన్యులు ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed