Last Updated:
ఈ సారి బిగ్ బాస్ హౌస్ మరింత స్ట్రాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌస్ లోకి ఓ టాప్ జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
తెలుగు బుల్లితెరపై తనదైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘ఆటో’ రాంప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. జబర్దస్త్ వేదికగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్, ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 10 కోసం సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.














