అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. సురభి హీరోయిన్గా నటిస్తుండగా రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 27న హైదరాబాద్‌లో మూవీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణుప్రియను ‘అగ్నిపరీక్ష’లో కంటెస్టెంట్లు పడుతున్న ఇబ్బందులపై విలేకరులు ప్రశ్నించారు.













