BJP Seva Sankalp Abhiyan: నేటి నుంచి బీజేపీ సేవా సంకల్ప అభియాన్.. పాతికేళ్ల మోదీ సేవలపై నెల రోజుల ప్రచారం | | ACTPnews

BJP Seva Sankalp Abhiyan


Last Updated:

BJP Seva Sankalp Abhiyan: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం నేడు. ఈసందర్భంగా ఆయన గడిచిన 25 ఏళ్లుగా ప్రధానిగా, ముఖ్యమంత్రిగా దేశానికి చేసిన సేవను గుర్తు చేసుకుంటూ బీజేపీ శ్రేణులు ‘సేవా సంకల్ప అభియాన్’ పేరుతో ఒక ప్రత్యేక నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

BJP Seva Sankalp Abhiyan
BJP Seva Sankalp Abhiyan

BJP Seva Sankalp Abhiyan: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం నేడు. ఈసందర్భంగా ఆయన గడిచిన 25 ఏళ్లుగా ప్రధానిగా, ముఖ్యమంత్రిగా దేశానికి చేసిన సేవను గుర్తు చేసుకుంటూ బీజేపీ శ్రేణులు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మోదీ ప్రజా జీవితం , సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) గురువారం నుండి ‘సేవా సంకల్ప అభియాన్’ పేరుతో ఒక ప్రత్యేక నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ నెల రోజుల పాటు బీజేపీ శ్రేణులు అనేక కార్యక్రమాలు, అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించారు.

నేల రోజుల సందేశ కార్యక్రమాలు..

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 7వ తేది నాటికి ప్రధాని మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ ‘సేవా సంకల్ప అభియాన్’ అనే ప్రత్యేక నెల రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సెప్టెంబర్ 9న పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు. ప్రధాని మోదీ సేవా ప్రస్థానం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రారంభమైంది. గత 25 ఏళ్లుగా, ‘ప్రజా సేవ నుండి దేశ సేవ’ అనే మంత్రంతో ఆయన నిరంతరం పనిచేశారు. ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టబోతోంది కమలదళం.

‘సేవా సంకల్ప అభియాన్’..

నరేంద్ర మోదీ పుట్టినరోజును బీజేపీ ‘సేవా దినం’గా జరుపుకుంటుంది. ఈ స్ఫూర్తితో ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సమాజంలోని సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రజా సేవ సందేశాన్ని చేరవేయడం ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అందుకే దీన్ని బీజేపీ ఒక బాధ్యతగా తీసుకుంది. ఈ ప్రచారం ద్వారా, ప్రజా సేవ, అభివృద్ధి , దేశ నిర్మాణం వంటి అంశాలతో కూడిన ప్రధాన మంత్రి మోదీ 25 ఏళ్ల ప్రజా జీవిత కృషిని ప్రజలకు తెలియజేస్తారు కమలనాధులు.

కలిసి నడవనున్న కమలదళం..

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని కేవలం రాజకీయ విజయాల పరంపరగా మాత్రమే కాకుండా ప్రజలకు , దేశానికి సేవ చేయాలనే అచంచలమైన నిబద్ధతగా చూడాలని బీజేపీ నేతలు పిలుపునిస్తున్నారు. అదే విధంగా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు , ప్రజలకు పిలుపునిచ్చారు నితిన్ నబిన్. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హేమంత్ ఖండేల్‌వాల్‌తో కలిసి మహాకాళ్ నగరమైన ఉజ్జయిని నుండి పార్టీకి చెందిన నెల రోజుల ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని నబిన్ ప్రారంభిస్తారు. బీజేపీ చేపట్టిన ఈ దేశవ్యాప్త ప్రచారంలో ఆ నెల రోజుల పాటు ప్రజలతో మమేకమయ్యే, సేవా దృక్పథంతో కూడిన అనేక కార్యక్రమాలు ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports