కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2026 సెప్టెంబర్ 16న సీబీఎఫ్సీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కొత్తగా పునర్వ్యవస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
1.వినోద్ అనుపమ్
2. మనోజ్ జోషి
3. అభిషేక్ జైన్
4. రికీ కేజ్
5. ప్రియదర్శన్
6. సునీల్ శెట్టి
7. హన్స్‌రాజ్ హన్స్
8. సుప్రియా యార్లగడ్డ
9. యతీంద్ర మిశ్రా
10. రూపాలీ గంగూలీ
11. ప్రీతి జింటా
12. నీల మాధబ్ పాండా
13. పంకజ్ త్రిపాఠి
14. ప్రోసెన్జిత్ ఛటర్జీ
15. పల్లవి జోషి
16. నిశిగంధ వాడ్
17. వామన్ కేంద్రీ
18. రమేష్ పటాంగే
సినీ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కొత్త బోర్డులో సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నటులు, దర్శకులు, సంగీత కళాకారులు, రచయితలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో చోటు దక్కించుకున్నారు. సినిమాలకు సర్టిఫికేషన్ జారీ చేయడంలో సీబీఎఫ్సీ కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఈ పునర్వ్యవస్థీకరణతో కొత్త బోర్డు మూడు సంవత్సరాల పాటు లేదంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విధులు నిర్వహించనుంది.













