Bodyguard: రామ్ చరణ్ బాడీగార్డ్‌కు నెలకు రూ.2 లక్షలు! ఈ స్కిల్స్ ఉంటే మీరు కూడా స్టార్ హీరోల బాడీగార్డ్ అవ్వొచ్చు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Bodyguard: సెలబ్రిటీల పక్కన కనిపించే బాడీగార్డ్స్ పని కేవలం బాడీ చూపించడం మాత్రమే కాదు. ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం, క్విక్ రెస్పాన్స్, మానసిక నియంత్రణ, ప్రత్యేక శిక్షణ వంటి నైపుణ్యాలు ఉంటేనే ప్రొఫెషనల్ సెక్యూరిటీగా రాణించగలరు. ప్రస్తుతం ఈ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ డిమాండ్ పెరుగుతోంది.

News18
News18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంటా (Kevin Kunta) గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపించే ఆయన శారీరక దృఢత్వం, స్టైలిష్ లుక్స్, రామ్ చరణ్‌కు ఆయన ఇచ్చే గ్లోబల్ లెవెల్ ఎలివేషన్స్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, ఎయిర్‌పోర్టులు, పబ్లిక్ ఈవెంట్స్‌లో జనం నుండి ఆయనకు రక్షణ వలయంలా నిలుస్తున్న కెవిన్ స్టైల్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే కెవిన్ జీతం నెలకు రూ.2 లక్షలు అని టాక్ నడుస్తోంది. దీంతో ఒక్కసారిగా సెలబ్రిటీలకు సెక్యూరిటీగా ఎలా మారాలి..? ఒక ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా రాణించాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి..? అనే ఆసక్తి చాలా మందిలో పెరుగుతోంది. మరి బాడీగార్డ్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలుసా?

“ప్రస్తుతం సెలబ్రిటీల భద్రతా ప్రమాణాలు పూర్తిగా కార్పొరేట్ స్థాయికి మారిపోయాయి. ఒక ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా రాణించాలంటే కేవలం జిమ్‌కు వెళ్లి బాడీ పెంచడం మాత్రమే సరిపోదు. అత్యున్నత మానసిక, శారీరక లక్షణాలు కూడా ఉండాలి. ముఖ్యంగా ‘డైనమిక్ రిస్క్ అసెస్‌మెంట్’ అంటే పరిస్థితులను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం చాలా కీలకం. రద్దీ ప్రదేశాల్లో ఎటువైపు నుంచి ప్రమాదం రావచ్చో సెకన్లలో గుర్తించాలి. అభిమానులు లేదా మీడియా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సహనం కోల్పోకుండా, క్లయింట్ ఇమేజ్ దెబ్బతినకుండా ‘హ్యూమన్ షీల్డ్’లా వ్యవహరించే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. గంటల తరబడి అలసట లేకుండా అప్రమత్తంగా ఉండే స్టామినా, అత్యవసర పరిస్థితుల్లో విఐపీలను సురక్షితంగా తరలించే టాక్టికల్ డ్రైవింగ్ నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉండాలి” అని SVSS సెక్యూరిటీస్ ప్రొప్రైటర్ ఎస్‌వీ రెడ్డి న్యూస్18 తెలుగుతో చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశంలో అగ్ర శ్రేణి సెలబ్రిటీల వద్ద హై-పెయిడ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్థిరపడటానికి కొన్ని కీలకమైన సర్టిఫికేషన్లు తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా విఐపి సెక్యూరిటీ రంగంలో బ్రిటన్‌కు చెందిన SIA (Security Industry Authority) Close Protection Licence కు అత్యంత గుర్తింపు ఉంది. అంతర్జాతీయ బాడీగార్డ్స్ చాలామంది ఈ కఠినమైన శిక్షణ పూర్తి చేసినవారే ఉంటారు. భారతదేశంలో అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని SSSDC (Security Sector Skill Development Council) ద్వారా పర్సనల్ ప్రొటెక్షన్ కోర్సులు పూర్తి చేయవచ్చు. వీటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు HECPO లేదా Red Cross సంస్థల నుండి లభించే అడ్వాన్స్‌డ్ ప్రథమ చికిత్స (First Aid & CPR) సర్టిఫికేషన్లు కలిగి ఉండటం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ బాడీ గార్డ్ ఎవరో తెలుసా..? బాబోయ్, అతని నెల శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు

చట్టపరమైన నిబంధనల విషయానికి వస్తే, భారతదేశంలో ప్రైవేట్ బాడీగార్డులు ఖచ్చితంగా PSARA Act, 2005 కింద లైసెన్స్ పొందిన రిజిస్టర్డ్ ఏజెన్సీ సభ్యులై ఉండాలి, “PSARA చట్టం ప్రకారం ‘బాడీగార్డ్’ అనే పదాన్ని ఉపయోగించకూడదు.. వారిని ‘సెక్యూరిటీ’గానే పిలవాలి. ప్రస్తుతం హై లెవల్ వ్యక్తులతో పాటు సాధారణ వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా ప్రత్యేక సెక్యూరిటీలను నియమించుకుంటున్నారు. వీరికి మంచి ఫిజిక్, కండలు తిరిగిన దేహం, మంచి పరివర్తన, క్విక్ రెస్పాన్స్‌తో పాటు ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది. స్థానికంగా వీరి జీతం రూ.30,000ల నుంచి రూ.50,000ల మధ్య ఉంటుంది” అని SVSS సెక్యూరిటీస్ ప్రొప్రైటర్ ఎస్‌వీ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి: UPI Users: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా?.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

ఇలా నియమించుకునే వ్యక్తులపై ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదన్నారు. ఏది ఏమైనప్పటికీ, కెవిన్ కుంటా ట్రెండ్‌ను గమనిస్తే.. కేవలం తెరపై కనిపించే హీరోలకే కాకుండా, వారి వెనుక ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించే ప్రొఫెషనల్ బాడీగార్డ్స్‌కు కూడా నేడు గ్లోబల్ స్థాయిలో డిమాండ్, గుర్తింపు మరియు కోట్ల రూపాయల ప్యాకేజీలు లభిస్తున్నాయని స్పష్టమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports