మొత్తానికి ఈ వారం బ్రహ్మముడి సీరియల్ డ్రామా, మైండ్ గేమ్స్, ప్రేమ సన్నివేశాల సమాహారంగా సాగింది. ధర్నాతో కథ ప్రారంభమై, రాజు మళ్లీ దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టడంతో కథ వేగం పుంజుకుంది. లక్కీని అడ్డుపెట్టుకుని రేఖకు చుక్కలు చూపిస్తున్న రాజు వ్యూహం వర్కవుట్ అవుతుండగా, మరోవైపు వెంకీ, నందుల ప్రేమకథలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఐశ్వర్య డబ్బు ఉన్న ఫ్రెండ్ వైపు మొగ్గుచూపుతుండటం, రేఖ భయపడుతున్న విషయాలు శేషు గ్రహించడం రాబోయే రోజుల్లో పెద్ద హడావుడికే దారితీసేలా ఉన్నాయి. లక్కీని ముందు పెట్టి రేఖ మీద రాజు ఆడుతున్న ఈ డ్రామా ఎటు తిరుగుతుంది? రేఖ రాజు మైండ్ గేమ్‌ను ఎలా తట్టుకుంటుంది? అనే ఆసక్తికర ప్రశ్నలతో ఈ వారం ఎపిసోడ్లు ముగిశాయి. వచ్చే వారం ఈ రచ్చ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. (Photo Credit: Brahmamudi Serial Star Maa / Jio+ Hotstar)














