సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాల బిగ్ అలర్ట్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 19 నెలల్లో సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని 403 కేసుల్లో రూ.102 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వీసీ సజ్జనార్, ఐపీఎస్ తెలిపారు. ట్రేడింగ్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’, ఓటీపీ ఫ్రాడ్స్, పెట్టుబడి మోసాల ద్వారా వృద్ధులను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని ఫోన్ చేసే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి భయపడొద్దన్నారు. భారత్లో ‘డిజిటల్ అరెస్ట్’ అనే చట్టపరమైన విధానం లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఫోన్ లేదా వీడియో కాల్లో డబ్బులు అడగరన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే మోసపూరిత ఖాతాలను త్వరగా నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
Over the last 19 months, senior citizens within the Hyderabad Police Commissionerate jurisdiction have lost a staggering ₹102 Crore across 403 cases to cybercriminals.
Scammers are increasingly targeting our elderly through trading frauds, digital arrest scams, OTP frauds, and… pic.twitter.com/7l5N0QTsxJ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 10, 2026













