Last Updated:
BRICS Summit 2026: ఢిల్లీలో జరుగుతున్న BRICS సదస్సుకు వచ్చే అతిథులకు వడ్డించే భోజనం కూడా ప్రత్యేకంగా ఉండనుంది. వివిధ దేశాల నుంచి వచ్చే VIP అతిథుల కోసం ప్రత్యేక వంటకాలతో పాటు.. వాటికి తగ్గట్టుగా డిజైన్ చేసిన ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, సర్వింగ్ పాత్రలను సిద్ధం చేశారు. జైపూర్‌కు చెందిన అరుణ్ సిగ్నేచర్ స్టోర్ ఈ ప్రత్యేక టేబుల్‌వేర్‌ను తయారు చేసింది.
ఢిల్లీలో జరుగుతున్న BRICS సదస్సుకు వచ్చే అతిథులకు ప్రత్యేకమైన టేబుల్‌వేర్‌లో ఆహారం వడ్డించనున్నారు. ఈ సదస్సు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, సర్వింగ్ పాత్రలను ఉపయోగించనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అరుణ్ సిగ్నేచర్ స్టోర్ ఈ ప్రత్యేక టేబుల్‌వేర్‌ను తయారు చేసింది. BRICS సదస్సులో వడ్డించే వంటకాలను దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ కలెక్షన్‌లోని అన్ని వస్తువులకు ప్రత్యేకంగా సిల్వర్ ప్లేటింగ్ చేశారు.













