రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి గురువారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తూ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తిరస్కరించడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. “అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, కనీసం మేడిగడ్డ మరమ్మతులకు సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కడతామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు” అని మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడితే రేవంత్ రెడ్డికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎవరూ చెరిపివేయలేరని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
Source link
BRS Leader Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










