Last Updated:
BRS Leaders Arrest: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ అగ్గిని రాజేశాయి. సమావేశాల తొలిరోజు పరిణామాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
BRS Leaders Arrest: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ అగ్గిని రాజేశాయి. సమావేశాల తొలిరోజు పరిణామాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న స్పీకర్‌పై దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో రెండో రోజు కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిపై ఎదురుదాడికి పాల్పడినట్లుగా ఆధారాలతో సహా కేసు నమోదు చేశారు.














