Last Updated:
పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం. బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల పసికందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసి వెళ్లగా.. మరుసటి రోజు అదే ప్రదేశానికి వచ్చి చూసేసరికి అక్కడ మృతదేహం కనిపించలేదు. పైగా ఖననం చేసిన చోట గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.














