Last Updated:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెగా కుటుంబ సభ్యులకు దక్కుతున్న పదవులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా చిరంజీవి కూతురు సుస్మిత రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెగా కుటుంబ సభ్యులకు దక్కుతున్న పదవులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో మెగా ఫ్యామిలీకి కీలక స్థానాలు లభిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయవాడలోని సుప్రసిద్ధ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుస్మిత కొణిదెలను నియమిస్తూ ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.














