Last Updated:
US-Iran War: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణానికి దారితీశాయి.
తమ ముడిచమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దీనిని శత్రువుకు గుణపాఠం చెప్పే శిక్షాత్మక చర్యగా అభివర్ణించింది. ఇరాన్ తమ భూభాగం వైపు ప్రయోగించిన 20 బాలిస్టిక్ క్షిపణుల్లో 18 క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మిగిలిన రెండు క్షిపణులు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడినట్లు స్పష్టం చేసింది.














